ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలి' - గుంటూరు క్లీన్ అండ్ గ్రీన్ సిటీ

గుంటూరును క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు నగరవాసుల సహకారం ఎంతో అవసరమని కమిషనర్ చల్లా అనురాధ అన్నారు. ప్రతిఒక్కరూ ఇందుకు సహకరించాలని కోరారు.

guntur commissioner anuradha
మహిళలకు పూల మొక్కలు అందజేస్తున్న కమిషనర్ చల్లా అనురాధ

By

Published : Nov 12, 2020, 7:03 PM IST

గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ అన్నారు. బొంగరాలబీడు, కన్యకా పరమేశ్వరి గుడి, సంపత్ నగర్​లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ప్రజలు నిర్వహిస్తున్న రూఫ్ గార్డెనింగ్, హోం కంపోస్ట్ తయారీని పరిశీలించారు. ఇంటివద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసి హోమ్ కంపోస్ట్ తయారుచేస్తున్న గృహిణులకు పూల మొక్కలు ఇచ్చి అభినందలు తెలిపారు.

అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు నగర ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. నగరంలో ఇళ్ల నుంచి వచ్చే వ్యర్ధాలను తడి - పొడి చెత్తలుగా విభజించి.. తడి చెత్తతో కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని అనుసరించాలన్నారు. దీనిపై ప్రజలకు అవగహన కల్పించాలని వార్డు వాలంటీర్లు, సెక్రటరీలకు సూచించారు. పొడి చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details