ఇదీ చదవండి:
కరోనాపై అప్రమత్తం.. ఆస్పత్రి వార్డులు పరిశీలించిన గుంటూరు కలెక్టర్ - indian students came back from china
కరోనా కలకలం నేపథ్యంలో చైనాలోని వుహాన్ నుంచి భారతీయులను ప్రత్యేక విమానంలో దిల్లీకి తీసుకువచ్చారు. చైనాలో చదువుకుంటున్న విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులను పరీక్షించేందుకు గుంటూరు ఆసుపత్రికి తీసుకువచ్చే అవకాశముంది. అమరావతి రోడ్డులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా వైరస్ వార్డులను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. ఈ వార్డుల్లో పరిశుభ్రత, టాయిలెట్లు, నీటి సరఫరాను పరీక్షించారు. హ్యాండ్ వాష్ బేసిన్లకు అమర్చిన కుళాయిలను వెంటనే సరి చేయాలని సిబ్బందికి సూచించారు.
కరోనా ప్రత్యేక వార్డులు పరిశీలించిన గుంటూరు కలెక్టర్
TAGGED:
latest news on carona virus