ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం: కలెక్టర్ దినేశ్ కుమార్ - panchayat elections in guntur

పంచాయతీ ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. శాంతిభద్రతల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు జిల్లా పోలీస్ యంత్రాంగం పేర్కొన్నారు.

panchayat elections in guntur
పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం

By

Published : Jan 27, 2021, 5:48 PM IST

గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆయనతోపాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని... ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వివరించారు. ఎన్నికల సామాగ్రి ఆయా మండల కేంద్రాలకు తరలించామన్నారు.

మిగతాచోట్ల కూడా ఎన్నికల నిర్వహణపై శిక్షణకు ఏర్పాట్లు చేశామన్నారు. శాంతిభద్రతల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని... అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి:పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details