కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో గుంటూరు కలెక్టరేట్లో పరిమిత సంఖ్యలో ఉద్యోగులు విధుల్లో ఉండాలని కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ శాఖల్లో కరోనా విస్తరిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లోని వివిధ విభాగాల్లో 50 శాతం ఉద్యోగులను విధుల్లో ఉంచాలని, మరికొందరు ఇంటి నుంచి పనిచేయాలని సూచించారు. సోమవారం ప్రభుత్వం కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. అతనితో పనిచేస్తున్న మరికొందరికి ఈ వ్యాధి సోకడం వల్ల ఉద్యోగులు కలవరపడుతున్నారు.
కరోనా ఎఫెక్ట్ : కలెక్టరేట్లో విధులకు పరిమిత సంఖ్యలో ఉద్యోగులు - guntur colllectorate latest news
గుంటూరు కలెక్టరేట్లో పరిమిత సంఖ్యలో ఉద్యోగులు విధుల్లో ఉండాలని కలెక్టర్ శ్యామ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారికి సోమవారం కరోనా నిర్ధరణ అయ్యింది. అతనితో పాటు పనిచేస్తున్న మరికొందరికి సోకడం వల్ల కలెక్టర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
గుంటూరు కలెక్టర్ ఉత్తర్వులు జారీ