గుంటూరు జిల్లాలో 15 రోజుల వరకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తామని.. ప్రజలు ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు రేషన్ షాపులు తెరుస్తామని చెప్పారు. ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సాధారణ ఓపీ సేవలు నిలిపివేశామని.. కేవలం అత్యవసర సేవలే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరిస్తూ.. స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే కరోనాను అరికట్టవచ్చని అన్నారు.
'జిల్లాలో 15 రోజుల వరకు ఉచిత రేషన్ పంపిణీ' - free ration news in guntur district
గుంటూరు సర్వ జనాసుపత్రిలో కేవలం అత్యవసర సేవలే అందుబాటులో ఉంటాయని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ స్పష్టం చేశారు. ఉచిత రేషన్‌ను 15 రోజుల వరకు పంపిణీ చేస్తామన్నారు. ప్రజలంతా.. కచ్చితంగా లాక్డౌన్ పాటించాలని కోరారు.

'జిల్లాలో 15 రోజుల వరకు ఉచిత రేషన్ పంపిణీ'