ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో వైద్యం వికటించిన.. బాలిక ఆరాధ్య మృతి - గుంటూరు జిల్లాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి

girl died
బాలిక ఆరాధ్య మృతి

By

Published : May 14, 2022, 8:47 AM IST

Updated : May 14, 2022, 9:44 AM IST

08:45 May 14

guntur aradhya

అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతురు కనుమరుగైపోయింది. కంటి కింద కణితి... తొలగించాలని ఆస్పత్రికి వెళ్లిన తల్లిదండ్రులకు... పాప శవాన్ని అప్పగించారు. ఆనందంగా ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ చిట్టితల్లి.. తిరిగిరాని లోకాలకు చేరింది. కన్నవారికి కడుపుకోత మిగిలింది.

గుంటూరు జిల్లాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరాధ్య(12) మృతి చెందింది. కంటి కింద కణితి తొలగించాలని చికిత్స కోసం జీజీహెచ్‌లో చేరిన ఆరాధ్య... కొద్దిసేపటి క్రితం ఆరాధ్య మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. శస్త్ర చికిత్స తర్వాత ఆరాధ్య పరిస్థితి విషమించడంతో... వెంటిలేటర్‌పై చికిత్స అందిచారు. నాలుగు రోజుల క్రితం జీజీహెచ్ నుంచి రమేశ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా పరిమితమైన ఆరాధ్య... మరణించిందని వైద్యులు తెలిపారు. వైద్యం వికటించి వెంటిలేటర్‌పైకి చేరినట్లు తల్లిదండ్రుల ఆరోపించారు.

ఇదీ జరిగింది:నగర శివారు అంకిరెడ్డిపాలానికి చెందిన ఏడుకొండలు, పావని దంపతుల కుమార్తె ఆరాధ్య. 12 ఏళ్ల పాపకు కంటి కింద చిన్న కణితి ఏర్పడింది. చిన్నారి ఎదుగుతున్న కొద్ది కణితి ఇబ్బందికరంగా మారుతుందని భావించిన తల్లిదండ్రులు... దానిని తొలగించేందుకు జీజీహెచ్‌ వైద్యులను సంప్రదించారు. శనివారం చిన్నారికి చికిత్స చేసి.. కణితి తొలగిస్తామని వైద్యులు చెప్పగా... ఆస్పత్రిలో చేర్పించారు. ఆపరేషన్‌కి తీసుకెళ్లేప్పుడు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి... చికిత్స సమయంలో పరిస్థితి విషమంగా ఉందని వెంటిలేటర్‌పై పెట్టినట్లు తల్లిదండ్రులు తెలిపారు. తమ కుమార్తెకు ఏమైందో కూడా వైద్యులు సరిగా చెప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 14, 2022, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details