వ్యాపారం పేరుతో స్నేహితులు మోసం చేశారంటూ... గుంటూరులో బసవయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన... మరణానికి ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. చంద్రమౌళినగర్‌కు చెందిన రావిపాటి బసవయ్య ప్రైవేటు కంపెనీల్లో అకౌంటెంట్‌గా పనిచేసేవారు. అయితే పొన్నం శ్రీనివాసరావు, రాపర్ల వెంకటేశ్వరరావు అనే ఇద్దరు అతనితో పెట్టుబడి పెట్టించి పత్తి వ్యాపారం చేశారు. అందులో తనని మోసగించినట్లు బసవయ్య వీడియోలో తెలిపారు.
మంత్రి పేరుతో బెదిరింపులు.. అకౌంటెంట్ ఆత్మహత్య - గుంటూరు నేర వార్తలు

మంత్రి పేరుతో బెదిరింపులు.. అకౌంటెంట్ ఆత్మహత్య
16:55 August 20
వ్యాపారం పేరుతో స్నేహితులు మోసగించారని సెల్ఫీ వీడియో
మోసం చేయటమే కాకుండా తనను మానసికంగా వేధించారని.... పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని బసవయ్య వీడియోలో ఆరోపించారు. హోంమంత్రి పేరు చెప్పి.. తన కుటుంబం అంతు చూస్తామని హెచ్ఛరించినట్లు తెలిపారు. వారితో పెట్టుకుని ఏమీ చేయలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించారు. తన ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
ఇదీ చూడండి..
Last Updated : Aug 20, 2020, 7:39 PM IST