ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో.. ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర పుస్తకావిష్కరణ - రచయిత బైరిశెట్టి మల్లికార్జున రావు

బైరిశెట్టి మల్లికార్జున రావు రచించిన ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర అనే పుస్తకాన్ని గుంటూరు ఎన్జీవో కళ్యాణమండపంలో ఆవిష్కరించారు. ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగడుతుందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు.

గుంటూరులోని ఎన్జీవో కళ్యాణమండపంలో పుస్తక ఆవిష్కరణ
గుంటూరులోని ఎన్జీవో కళ్యాణమండపంలో పుస్తక ఆవిష్కరణ

By

Published : Feb 28, 2021, 12:46 PM IST

రచయిత బైరిశెట్టి మల్లికార్జున రావు రచించిన ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర అనే పుస్తకాన్ని.. గుంటూరు ఎన్జీవో కళ్యాణమండపంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. గ్రూపు పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇందులో చరిత్ర, సామాజిక అంశాలు, ప్రస్తుత రాజకీయ అంశాలన్ని ఉన్నాయని చెప్పారు.

తాను మొదటిసారి రచించిన ఈ పుస్తకాన్ని అందరూ చదివి ఆశీర్వదించాలని పుస్తక రచయిత మల్లికార్జున రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతోపాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రెజరిస్ అండ్ అకౌంట్స్ హనుమంతరావు, హిందూ కళాశాల వైఎస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, తులసి గ్రూప్ కంపెనీ చైర్మన్ తులసి రామచంద్రప్రభు, తదితరలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details