ఏడేళ్ల తర్వాత గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 35, 36వ స్నాతకోత్సవానికి ముస్తాబయ్యింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్, డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రెండు స్నాతకోత్సవాలకు యూజీ, పీజీకి కలిపి 240, రెగ్యులర్ పీహెచ్డీలు 170, దూరవిద్యాకేంద్రం నుంచి 10, ఎంఫిల్ పట్టాలు 2 ప్రధానం చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 నిమిషాల వరకు స్నాతకోత్సవం జరగనుందని రిజిస్ట్రార్ రోశయ్య చెప్పారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఘనంగా 35, 36వ స్నాతకోత్సవం - గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వార్తలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 35, 36వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్, డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
![ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఘనంగా 35, 36వ స్నాతకోత్సవం graduation ceremonies at anu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6217147-106-6217147-1582770938088.jpg)
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవాలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవాలు
ఇవీ చూడండి: