ఇదీ చదవంరాజ్యాంగం కల్పించిన హక్కులతోపాటు బాధ్యతలను గుర్తించినప్పుడే... దాని స్ఫూర్తిని గౌరవించినట్లవుతుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరిగింది. ఈ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం హక్కులు వచ్చాయని... అదే సమయంలో సమాజం పట్ల బాధ్యతగా మెలగాలనే విషయాన్ని కూడా చెబుతోందని వివరించారు.
'హక్కులతోపాటు బాధ్యతలనూ గుర్తించాలి' - ఏపీ గవర్నర్ తాజా వార్తలు
గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
'మన హక్కులను మనం కాపాడుకోవాలి'
ఎందరో మహనీయులు త్యాగాలు చేసి స్వాతంత్రం తెచ్చారని... కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పాల్గొన్నారు. విద్యతోనే పేదరిక నిర్మూళన సాధ్యమని అంబేడ్కర్ చెప్పారని... అందుకు అనుగుణంగానే ప్రభుత్వం చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.డి :