ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అదృశ్యం.. రూ.కోటికి పైగా అప్పు! - teacher missing in Mangalagiri

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు... ఈ నెల 11 నుంచి కనిపించకుండా పోయింది. భర్త వీరాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

government teacher
మంగళగిరిలో కనిపించకుండా పోయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

By

Published : Feb 15, 2021, 6:24 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్​ఎస్​ఆర్​ ప్లాజా అపార్ట్​మెంట్​లో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఝాన్సీరాణి కనిపించటం లేదంటూ ఆమె భర్త వీరాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 11 సాయంత్రం గాలిగోపురం వద్ద బైక్ పార్క్ చేసి వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి కనిపించటం లేదని ఫిర్యాదులో వీరాంజనేయులు పేర్కొన్నారు.

ఝాన్సీరాణి తుళ్లూరు మండలం మందడంలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు మంగళగిరిలో రూ.కోటి కిపైగా అప్పు ఉన్నట్లు గుర్తించారు. ఝాన్సీరాణి తన చరవాణిని కాక మరో నంబరు నుంచి బ్యాంక్ ఖాతాల లావాదేవీలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. త్వరలోనే ఝాన్సీరాణి ఆచూకీ కనుక్కుంటామని పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details