ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరు ఛానల్​ పొడిగింపునకు సర్కార్ ఆదేశాలు - గుంటూరు ఛానల్​ పనులకు రివర్స్ టెండరింగ్

గుంటూరు, ప్రకాశం జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. గుంటూరు ఛానల్​ పొడిగింపు పనులకు పూనుకుంది.

ఛానల్

By

Published : Oct 18, 2019, 9:33 AM IST

గుంటూరు ఛానల్​ పొడిగింపునకు సర్కార్ ఆదేశాలు

గుంటూరు ఛానల్‌ పొడిగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాలువ సర్వేకు గత ప్రభుత్వం 89.5 లక్షల రూపాయలను కేటాయించగా...2019 జనవరి 10 న కాలువ పొడిగింపునకు 274.53 కోట్లరూపాయలను మంజూరు చేసింది. ఎన్నో పోరాటాల ఫలితంగా తమ కల నెరవేరిందని ప్రజలు సంతోషించేలోపే కొత్త ప్రభుత్వం రావడటంతో పనులు నిలిపివేశారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. కొంతమంది స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతో ఎట్టకేలకు స్పందన లభించింది. రెండు రోజుల క్రితం పనులు రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు రివర్స్ టెండరింగ్​కు ఆదేశాలు జారీ చేసింది. కాలువ పొడిగిస్తే గుంటురు జిల్లా పెదనందిపాడు నుంచి ప్రకాశం జిల్లా పర్చూరులోని అన్ని గ్రామాలకు తాగునీరు అందుతుంది. 49 గ్రామాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. పర్చూరు ప్రజలు తమ ఆశలు నెరవేరే అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details