ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యార్డు కమిటీ నిర్ణయం.. మిర్చి రైతులకు ఉపశమనం - మిర్చి రైతులకు ఉపశమనం

లాక్​డౌన్ కారణంగా మిర్చి యార్డుకు విరామం ప్రకటించటంతో.. సరుకు అమ్మకాలు ఆగిపోయాయి. ఈ మేరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు మిర్చి యార్డు కమిటీ నిర్ణయం ఊరటనిచ్చింది. మిర్చియార్డు పరిసరాల్లో లైసెన్సు కలిగిన వారు పంట అమ్ముకోవచ్చని కమిటీ సభ్యులు సూచించారు.

Good news for guntur Mirchi farmers
Good news for guntur Mirchi farmers

By

Published : Apr 12, 2020, 12:38 PM IST

లాక్‌డౌన్‌తో గుంటూరు మిర్చి యార్డును మూసివేయటంతో... సరుకు అమ్మకాలు తగ్గిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. అత్యవసరానికి డబ్బులు కావాలనుకునే రైతులకు యార్డు కమిటీ నిర్ణయం ఊరటనిచ్చింది. మిర్చియార్డు పరిసరాల్లో లైసెన్స్‌ కలిగినవారు పంటను అమ్ముకోవచ్చని కమిటీ సభ్యులు సూచించారు. గుంటూరులోని శీతల గోదాముల్లో నిల్వ చేసే మిరప పంట.. బస్తాకు 150 రూపాయలు, హమాలీ కూలీ, బీమాగా మరో 40 రూపాయలు నిర్ణయించారు. ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల లావాదేవీలకు మినహాయింపు ఇచ్చినందున.. గోదాముల్లో నిల్వ ఉంచుకోవాలని శీతల గోదాముల వ్యాపారులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details