ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కూల్చివేతలపై కార్పొరేటర్ ధర్నా.. బ్రాడీపేటలో ఉద్రిక్తత - Guntur Municipal Corporation latest news

గుంటూరు నగరపాలక సంస్థలో ఆక్రమణల కూల్చివేత విషయంపై జీఎంసీ 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ వెంకటకృష్ణ, ఉప ప్లానింగ్‌ అధికారిణి మధ్య వాగ్వాదం.. ఉద్రిక్తతకు దారి తీసింది. డిప్యూటీ సిటీ ప్లానర్‌(డీసీపీ) చర్యలను నిరసిస్తూ.. బ్రాడీపేటలో కార్పొరేటర్ ధర్నా చేపట్టారు.

corporator venkatakrishna protest
జీఎంసీ డీసీపీ వర్సెస్‌ కార్పొరేటర్‌

By

Published : Aug 28, 2021, 4:40 PM IST

గుంటూరు నగరపాలక సంస్థ ఉప ప్లానింగ్‌ అధికారిణి, 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఈచంపాటి వెంకటకృష్ణకు మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఇప్పటికే రెండుసార్లు ఆక్రమ కట్టడాలని కూల్చివేశారని.. ఇప్పుడు మరోమారు అదే భవనం వద్ద కూల్చివేతకు రావడం సరికాదని కార్పొరేటర్ పేర్కొన్నారు. ప్రభుత్వం బీపీఎస్‌ అవకాశం ఇచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకుంటారని చెప్పినప్పటికీ కూల్చివేతకు డిప్యూటీ సిటీ ప్లానర్‌ (DCP) మరోమారు సిద్ధం కావడాన్ని కార్పొరేటర్‌ తప్పుబట్టారు.

రోడ్డుపై రాకపోకలకు అడ్డుగా ఉన్న వీధి వ్యాపారుల వాహనాలను పక్కకు జరిపించే ప్రయత్నం చేయాలని కోరితే.. ఆ విషయం పట్టించుకోకుండా కావాలని ఒకే భవనం నిర్వాహకుడిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే డీసీపీని బదిలీ చేయాలని నగర మేయర్‌, కమిషనర్​ను కోరారు. బ్రాడీపేట 4వలైన్​ మార్గంలో డీసీపీ చర్యలకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ఆక్రమణలకు తాము వ్యతిరేకమే అని.. అయితే డీసీపీ తీరుపైనే అభ్యంతరమని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details