ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలే' - ప్రజా ఫిర్యాదులపై జీఎంసీ కమిషనర్

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వివిధ విభాగాధిపతులకు గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ సూచించారు. వార్డు సచివాలయాల్లో ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

'సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు'
'సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు'

By

Published : Dec 14, 2020, 9:26 PM IST

వార్డు సచివాలయాల్లో ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ విభాగాధిపతులను ఆదేశించారు. ఇవాళ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహించగా....ప్రజల నుంచి వివిధ సమస్యలపై 36 ఫిర్యాదులు అందాయి. ముందుగా గత వారం అందిన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి సంబంధించి విభాగాల వారీగా ఆయా విభాగాదిపతులతో కమిషనర్​ సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆమె వివిధ శాఖాధిపతులకు సూచించారు.

తాగునీరు, పారిశుద్ద్యంపై ఫిర్యాదులు అందిన వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. వార్డు సచివాలయాల్లో ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాత యూజీడీ లైన్ ఉన్న ప్రాంతాల్లో మురుగు ఓవర్ ఫ్లో అవ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ, అనధికార కట్టడాలపై చర్యలు తీసుకోవాలని..టౌన్ ప్లానింగ్ కార్యదర్శి ప్రతి రోజు సచివాలయ పరిధిలో పర్యటిస్తూ తనిఖీ చేస్తుండాలన్నారు. కాలువల్లో తీసిన వ్యర్థాలను వెంటనే తొలగించాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో గ్యాంగ్ వర్క్​తో శుభ్రం చేయిచాలని యంహెచ్​వోను ఆదేశించారు. వీధి కుక్కలకు వ్యాక్సిన్, స్టెరిలైజేషన్ చేయించాలన్నారు. టిడ్కో, హౌసింగ్ మీద వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని..అర్హులు, అనర్హుల జాబితాలు ఆయా సచివాలయాల్లో కనిపించేలా ఉంచాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details