గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. పెండింగ్ వేతనాలను చెల్లించాలని విధులు బహిష్కరించి ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. తమకు గత ఆరు నెలలుగా పొరుగుసేవల గుత్తేదారు వేతనం ఇవ్వడం లేదంటూ వాపోయారు. జీతాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని... కుటుంబ పోషణ కష్టంగా మారిందని సెక్యూరిటీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
వారు జీతాలు అడిగితే రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలాజీ గుత్తేదారు సంస్థ కింద పనిచేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని... అందుకు నిరసనగా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగామన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని తమకు పెండింగ్ లో ఉన్న 6 నెలల వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జీతాల కోసం జీజీహెచ్ సెక్యూరిటీ ధర్నా
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. గత ఆరు నెలలుగా పొరుగుసేవల గుత్తేదారు వేతనం ఇవ్వడం లేదంటూ వాపోయారు
జీతాల కోసం జీజీహెచ్ సెక్యూరిటీ ధర్నా
Last Updated : May 6, 2019, 11:10 AM IST