ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరు జీజీహెచ్​లో మృతదేహాల తరలింపునకు చర్యలు - covid dead bodies news

గుంటూరు జీజీహెచ్​లో మృతదేహాలు పేరుకుపోయిన నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. మృతదేహాల తరలింపు బాధ్యతను ఆయా ప్రాంతాల తహసీల్దార్లకు అప్పగించారు. వారు కుటుంబ సభ్యులతో చర్చించి.. మృతదేహాలు తీసుకెళ్లేలా చూస్తున్నారు. ఎవరూ లేని మృతేదేహాలను పోలీసుల, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది ఖననం చేయనున్నారు.

గుంటూరు జీజీహెచ్​లో మృతదేహాల తరలింపునకు అధికారుల చర్యలు
గుంటూరు జీజీహెచ్​లో మృతదేహాల తరలింపునకు అధికారుల చర్యలు

By

Published : Jul 28, 2020, 4:01 PM IST

గుంటూరు సర్వజనాస్పత్రిలో మృతదేహాలు పేరుకుపోయిన అంశం కలకలం రేపిన వేళ... అధికారులు చర్యలు చేపట్టారు. మార్చురీలోని 45 మృతదేహాల్లో 21 కరోనా వైరస్ ప్రభావిత మృతదేహాలే ఉన్నాయి. వీటిని తీసుకెళ్లేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో... జిల్లాలో ఆయా ప్రాంతాల తహసీల్దార్లకు మృతదేహాల తరలింపు బాధ్యతలు అప్పగించారు. రంగంలోకి దిగిన వారు... కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతదేహాలను తీసుకెళ్లేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేక బ్యాగులో చుట్టి జిప్ వేసి అప్పగించడం సహా... అంత్యక్రియల్లో చేపట్టాల్సిన జాగ్రత్తలను వివరించారు. బంధువులెవరో తెలియని మృతదేహాలను పోలీసులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది ఖననం చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details