గుంటూరు బస్టాండ్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పాత గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 72 వేల విలువ చేసే 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నుంచి కర్ణాటకలోని బళ్లారికి గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని కిలో 4 వేల రూపాయలకు కొనుగోలు చేసి..బళ్లారిలో రూ.18 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పాత గుంటూరు సీఐ వాసు చెప్పారు. గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ పెట్టామన్నారు.
పోలీసుల తనిఖీలు..