Ganesh mandapam with currency notes: సాధారణంగా వినాయక చతుర్థి వచ్చిందంటే చాలు అందరిలోనూ ఉత్సాహం పొంగుకొస్తుంది. కొందరు కళాకారులు విభిన్న రూపాల్లో గణనాథులను తయారు చేసి తమ ప్రతిభను చాటుకుంటారు. మరికొందరు విభిన్న రకాల వస్తువులు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పువ్వులు ఇలా అనేక రకాల పదార్థాలను వినియోగించి ఏకదంతుడిని తయారు చేస్తుంటారు. ఆయన మండపాలను అలంకరిస్తుంటారు. తమ భక్తిని ఇలా అనేక రకాలుగా చాటుకుంటారు. అలాగే గుంటూరులో ఓ యూత్ బృందం ఏళ్లుగా తమ భక్తిని వినూత్నంగా చాటుకుంటున్నారు. అదెలాగంటే... పార్వతీపుత్రుడి కీరటం దగ్గరి నుంచి ఆయనను ప్రతిష్ఠించే మండపం వరకూ పూర్తిగా కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఇది ఎంత అందంగా కనిపిస్తుందో..! ఒకసారి మీరు కూడా ఎలా చేశారు? ఎక్కడ అనే విషయాలను చదివేయండి మరి....
కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో వినాయక మండపం... ఎక్కడో తెలుసా..? - గుంటూరు తాజా వార్తలు
Ganesh mandapam with currency notes: పండ్లు, పువ్వులతో వినాయకుడి, మండపాలను తయారు చేయడం చూసుంటారు... ధాన్యంతో చేయడమూ చూసుంటారు... ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు, ఐరన్ వస్తువులతోనూ చేయడం కూడా చూసుంటారు. కానీ కరెన్సీ నోట్లతో విఘ్నేశ్వరుడిని, ఆయన మండపాన్ని అలకంరించడం ఎప్పుడైనా చూశారా..? ఇందుకోసం ఈపాయి నుంచి 2వేల నోటు వరకు ఉపయోగించారనడం ఎప్పుడైనా విన్నారా..? అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ చదవండి. వినండి.
గుంటూరులో వాసవి యూత్ ఏర్పాటు చేసిన వినాయక మండపం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. ప్రతిఏటా గణేష్ ఉత్సవాల్లో కరెన్సీతో అలంకరించటం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాడి కూడా వినాయక మండపాన్ని నోట్లతో నింపేశారు. మొత్తం 1.60 కోట్ల రూపాయల నోట్లతో అలంకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. రూపాయి నాణెం నుంచి 2వేల రూపాయల నోట్ల వరకూ అన్నింటిని అలంకరణ కోసం ఉపయోగించారు. వినాయకుడి కిరీటం, స్వామివారికి దండలు, విగ్రహం వెనుక వైపు అలకంరణలు, మండపంలో తోరణాలన్నీ కూడా కరెన్సీ నోట్లతో ఏర్పాటు చేశారు. భారతదేశ చిత్రపటంతో పాటు పొట్టిశ్రీరాములు, గాంధీ చిత్రాలతో ముగ్గువేశారు. వాటి చుట్టూ కూడా నాణేలతో అలంకరించారు. స్థానిక వ్యాపారులందరి సహకారంతో ఈ అలంకరణ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చదవండి: