ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీజీహెచ్​లో ఎంపీ గల్లా జయదేవ్​... అచ్చెన్న ఆరోగ్యంపై ఆరా

రానున్న నెలల్లో కరోనా మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు జీజీహెచ్​లో కొవిడ్​ చర్యలపై ఆరా తీసిన ఎంపీ.. ఎంపీ లాడ్స్ వినియోగంపై సూపరింటెండెంట్ సుధాకర్​తో చర్చించారు. అచ్చెన్నాయుడికి అందిస్తున్న చికిత్సను సూపరింటెండెంట్ సుధాకర్​.. ఎంపీకి వివరించారు. అచ్చెన్నాయుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున కలిసేందుకు అవకాశం లేదని తెలిపారు.

By

Published : Jun 15, 2020, 3:32 PM IST

జీజీహెచ్​లో ఎంపీ గల్లా జయదేవ్​... అచ్చెన్న ఆరోగ్యంపై ఆరా
జీజీహెచ్​లో ఎంపీ గల్లా జయదేవ్​... అచ్చెన్న ఆరోగ్యంపై ఆరా

జులై, ఆగస్టు నెలల్లో కరోనా ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సూచించారు. దేశంలో కేసులు అదుపులోకి రావడం లేదన్నారు. లాక్​డౌన్ సడలింపుల తర్వాత కేసుల తీవ్రత మరింత పెరిగిందని ఎంపీ గుర్తు చేశారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కొవిడ్ నియంత్రణ చర్యలు, ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్​తో ఎంపీ జయదేవ్ చర్చించారు.

వెంటిలేటర్లు, పీపీఈల కోసం తను ఎంపీ ల్యాడ్స్ కింద ఇచ్చిన రూ.2.5 కోట్ల నిధులను ఎందుకు పూర్తిగా వినియోగించలేదని ఇంజినీరింగ్ అధికారులను ఎంపీ ప్రశ్నించారు. మరోవైపు.. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని సూపరింటెండెంట్ సుధాకర్ వివరించారు. అచ్చెన్న జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున నేరుగా కలిసేందుకు అవకాశం లేదని సూపరింటెండెంట్ సుధాకర్ వివరించారు. అనుమతి కోసం దరఖాస్తు చేశామని ఎంపీ గల్లా చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details