ముగిసిన బ్యాడ్మింటన్ కోచ్ సుధాకర్‌రెడ్డి అంత్యక్రియలు - badmintion
ఈ నెల 5న బల్గేరియాలో మరణించిన బ్యాడ్మింటన్ సీనియర్ కోచ్ సుధాకర్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.
గుంటూరులో బ్యాడ్మింటన్ కోచ్ సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు
By
Published : Aug 12, 2019, 4:40 PM IST
ముగిసిన బ్యాడ్మింటన్ కోచ్ సుధాకర్‌రెడ్డి అంత్యక్రియలు
గుంటూరులో బ్యాడ్మింటన్ సీనియర్ కోచ్ సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఈ నెల 5న బల్గేరియాలో సుధాకర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. వారం రోజుల తర్వాత సుధాకర్‌రెడ్డి మృతదేహం గుంటూరుకు చేరుకోగా... బంధువులు, అశేష క్రీడాభిమానులు కడసారి వీడ్కోలు పలికారు. రాష్ట్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ కుమార్, శాప్ అధికారులు సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్, అతని సోదరుడు నందగోపాల్ సహా వందలాదిమంది క్రీడాకారులకు సుధాకర్ రెడ్డి కోచ్‌గా వ్యవహరించారు.