కరోనా మూడో వేవ్ దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టామని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని గుంటూరు జిల్లా వైద్య అధికారిణి యాస్మిన్ అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి ఏడాది దాటిన వేళ గుంటూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ గంగాధరంతో కలిసి డీఎంహెచ్‌వో యాస్మిన్... ఫ్రంట్ లైన్ వారియర్స్ ను అభినందించి ఘనంగా సన్మానించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు వెలకట్టలేనివన్నారు. కరోనా మూడో వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు : యాస్మిన్ - guntur district news
గుంటూరు జిల్లాలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి ఏడాది దాటిన వేళ భాజపా ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
డీఎంహెచ్‌వో యాస్మిన్.