ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. బుర్రిపాలెం ప్రజలకు ఉచిత టీకా - vaccination news

ప్రముఖ సినీ నటులు సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా స్వగ్రామం బుర్రిపాలెం ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్ర హాస్పటల్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు తెలిపారు.

free vaccination to burripalem villagers
బుర్రిపాలెం ప్రజలకు ఉచిత టీకా

By

Published : May 31, 2021, 4:23 PM IST

Updated : May 31, 2021, 4:40 PM IST

బుర్రిపాలెం గ్రామస్తులకు ఉచిత టీకా పంపిణీ కార్యక్రమం...

సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం పురస్కరించుకుని ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టారు. ఆంధ్ర హాస్పటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం రోజుకు మూడువందల డోసుల చొప్పున 4 రోజులు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్థులంతా వినియోగించుకోవాలని సూచించారు. తమ అభిమాన నటుడు కృష్ణకు.. గ్రామస్థులు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తోపాటు భాజపా నేతలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 31, 2021, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details