ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో బ్రాహ్మణులకు ఉచిత సౌకర్యాలు - ttd latest news

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించే బ్రాహ్మణులకు ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వసతి కేంద్ర సభ్యులు రామరాజు శ్రీనివాసరావు తెలిపారు.

Free services to Brahmins at ttd
తిరుపతిలో బ్రాహ్మణులకు ఉచిత సౌకర్యాలు

By

Published : Aug 11, 2021, 7:07 PM IST

తిరుమల సందర్శించే బ్రహ్మణుల కోసం తిరుపతిలో ఉచిత అన్నప్రసాద వితరణ వసతి కేంద్రం ప్రారంభిస్తున్నట్లు వసతి కేంద్ర సభ్యులు రామరాజు శ్రీనివాసరావు తెలిపారు. 'శ్యామల నిత్యాన్నదాన వితరణ కేంద్రం' పేరుతో తిరుచానూరు రోడ్డులోని పద్మావతిపురంలో ఈనెల 14న కేంద్రం ప్రారంభమవుతుందన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే బ్రాహ్మణులకు స్నానం, సంధ్యావందనం చేసుకునే వసతితోపాటు, అల్పాహారం, భోజనం, ఉచితమని తెలిపారు. తిరుపతికి చెందిన వ్యాపారవేత్త సాయిస్వామి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలనుకునే బ్రాహ్మణులు వివరాల కోసం 9440437221 ఫోన్​ నంబర్​కు సంప్రదించవచ్చన్నారు.

ABOUT THE AUTHOR

...view details