నలుగురు మైనర్లు అదృశ్యమైన ఘటన గుంటూరు నగరంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరులోని నెహ్రూనగర్‌కు చెందిన నలుగురు మైనర్లు గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. వారిలో ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. బాలికల వయస్సు 14, 15 ఏళ్లుకాగా బాలుర వయస్సు 13, 17 ఏళ్లు. వీరిలో ముగ్గురు పిల్లలది ఒకటే కుటుంబం. ఇంటి వద్ద పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారని భావించి తల్లిదండ్రులు ఊరుకున్నారు.
చీకటిపడుతున్నా ఇంటికి రాకపోవడంతో వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో గురువారం రాత్రి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి నలుగురు మైనర్లు కనిపించకుండాపోవడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు.