ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో ఆహార భద్రత అధికారుల తనిఖీలు.. కఠిన చర్యలు - food safety officials raids in guntur

గుంటూరు నగరంలోని పలు హోటళ్లపై ఆహార భద్రత శాఖ, పురపాలక శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. నియమాలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి.. లైసెన్స్​ లేకుండా నిర్వహిస్తున్న హోటళ్లను సీజ్​ చేశారు.

food safety officials raids at guntur hotels
గుంటూరులో ఆహార భద్రత అధికారుల తనిఖీలు.. పలు హోటళ్లు సీజ్​

By

Published : Apr 8, 2021, 5:36 PM IST

గుంటూరులోని పలు హోటళ్లపై ఆహార భద్రత శాఖ, పురపాలక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బ్రాడీపేట మూడోలైనులో ట్రేడ్ లైసెన్సు లేకుండా నిర్వహిస్తున్న హోటల్​ను అధికారులు సీజ్ చేశారు. బ్రాడీపేటలో నాలుగో లైనులో ఓ హోటల్లో పాడైన 6 కిలోల చికెన్​ను స్వాధీనం చేసుకున్నారు. మరో హోటల్లో నిల్వ ఉన్న చికెన్ పదార్థాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వీటిపై కేసులు నమోదు చేశారు.

అరండల్‌పేట 6వ లైనులో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మరో హోటల్​ను అధికారులు సీజ్ చేశారు. ఆహార భద్రత ప్రమాణాల శాఖ డిప్యూటీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పాడైన, కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని.. నగరంలో నిరంతరం నిఘాను ఏర్పాటు చేశామని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details