ఆహార పదార్థాల కల్తీ నియంత్రణపై వ్యాపారులకు ఆహార భద్రత అధికారులు శిక్షణ నిర్వహించారు. గుంటూరులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శనివారం నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమానికి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ హాజరయ్యారు.
జిల్లాలో వ్యాపారులందరికీ ఆహార కల్తీ నియంత్రణపై శిక్షణ అందిస్తున్నామని ఆయన తెలిపారు. శిక్షణలో ఉత్తీర్ణులైన వ్యాపారులకి ధ్రువపత్రాలు ఇస్తామని.. భవిష్యత్తులో ఈ పత్రం లేకుంటే వ్యాపారానికి లైసెన్స్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హోల్ సేల్ నుంచి రిటైల్ వ్యాపారులందరికి దశల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ చెప్పారు.