YCP Flexi Issue: గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్లలో మంగళవారం ఉదయం ఓ ఫ్లెక్సీ కలకలం సృష్టించింది. మోసపోయిన వైకాపా కార్యకర్తల పేరుతో స్థానిక ఎస్సీ కాలనీలో ప్లెక్సీ ఏర్పాటుచేశారు. ఓట్లు కోసం ఎస్సీలను వాడుకున్నారని పార్టీ అధికారంలోకి వచ్చాక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇక నుంచి ముప్పాళ్ల వైకాపా నాయకులు తమ కాలనీకి వచ్చి రాజకీయాలు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఒకవేళ వస్తే బుద్ధిచెప్తామని హెచ్చరించారు.
YCP Flexi Issue : 'మోసపోయిన వైఎస్సాఆర్సీపీ కార్యకర్తలు'.. ముప్పాళ్లలో ఫ్లెక్సీ కలకలం.. - ముప్పాళ్లలో వైకాపా ఫ్లెక్సీ గొడవ
YCP Flexi Issue: గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్లలో మంగళవారం ఉదయం ఓ ఫ్లెక్సీ కలకలం సృష్టించింది. మోసపోయిన వైఎస్సాఆర్సీపీ కార్యకర్తల పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.
![YCP Flexi Issue : 'మోసపోయిన వైఎస్సాఆర్సీపీ కార్యకర్తలు'.. ముప్పాళ్లలో ఫ్లెక్సీ కలకలం.. YCP Flexi Issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13903592-1097-13903592-1639479805326.jpg)
ముప్పాళ్లలో ఫ్లెక్సీ కలకలం
ముప్పాళ్లలో ఫ్లెక్సీ కలకలం
సమాచారం అందుకున్న పంచాయతీ సెక్రెటరీ, వీఆర్ఓలు ఫ్లెక్సీని తొలగించి ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం తెలియజేశారు.
ఇదీ చదవండి : Old Age Pensions Hike in AP: జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛను పెంపు