ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చేపలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వండి’ - గుంటూరులో లాక్ డౌన్

లాక్ డౌన్ తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని.. తమకు చేపలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని గుంటూరు మత్స్యకారు సహకార మహిళా సొసైటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

fish selling women lost work due to lock down
ఉపాధి లేక మత్స్యకార సహకార మహిళా సొసైటీ సభ్యుల కష్టాలు

By

Published : May 20, 2020, 1:27 PM IST

చేపలు అమ్మకోవడానికి అనుమతి ఇవ్వాలని గుంటూరు మత్స్యకార సహకార మహిళా సొసైటీ సభ్యులు కోరుతుతున్నారు. సుమారు రెండు నెలలుగా ఉపాధి కొల్పోయామని విచారం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ తో కుబుంబం గడవక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మాంసం దుకాణాలకు అనుమతి ఇస్తున్నారని.. తమకు చేపలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు. గుంటూరు మున్సిపల్ కమిషనర్, మత్స్యశాఖ అధికారుల చుట్టూ సహకార సంఘం మహిళలు అనుమతి కోసం తిరుగుతున్నారు. అనుమతిస్తే.. ఇళ్ల వద్దకే వెళ్లి అమ్మకాలు చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details