మండల పరిషత్తు అధ్యక్షుని(ఎంపీపీ)పై తొలి అవిశ్వాసం ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంతోనే ప్రారంభమైంది. అప్పట్లో అవిశ్వాస రాజకీయ పరిణామాలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. తెదేపాలో ఆధిపత్య పోరుకు ఇవి అద్దం పట్టాయి. 1995 నుంచి మండల ప్రజాపరిషత్తు అధ్యక్ష ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరిగింది. ముప్పాళ్ల మండలంలో జరిగిన ఎన్నికల్లో మాదబ గ్రామానికి చెందిన గోగినేని కోటేశ్వరరావు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం రెండేళ్లు కూడా పూర్తవ్వకముందే సొంత పార్టీ నుంచే అవిశ్వాసం ఎదుర్కొన్నారు. 1996 ఆగస్టులో ఆయనపై తెదేపా సభ్యులే అవిశ్వాసం పెట్టారు. చివరికి గోగినేని అవిశ్వాస పరీక్షలో నెగ్గి ఐదేళ్లపాటు పూర్తిస్థాయి పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఎంపీపీ, వైస్ ఎంపీపీలపై మొదటి రెండేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేకుండా ప్రభుత్వం నిబంధనలు రూపొందిచింది. కాలక్రమేణా ఇప్పుడు నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. దీంతో కనీసం నాలుగేళ్లు కుర్చీలో స్థిమితంగా కూర్చునే అవకాశం దక్కింది.
ఎంపీపీపై తొలి అవిశ్వాసం గుంటూరు జిల్లాలోనే - ఎంపీపీపై తొలి అవిశ్వాసం వార్తలు
అవిశ్వాసం..సాధారణంగా ప్రజాప్రతినిధులను తొలగించే ఓ ప్రక్రియ. అలా ఓ ఎంపీపీ (మండల ప్రజాపరిషత్తు అధ్యక్షుడి)ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా అవిశ్వాసం ద్వారా తొలగించారు. ఈ పరిస్థితులకు దారితీసిన కారణాలెంటో చూద్దాం.!
first distrust of the MPP was in guntoor district