Fire accidents: గుంటూరు జిల్లా తెనాలి పాండురంగపేటలో అర్ధరాత్రి ఈదురుగాలులకు కొవ్వొత్తి ఎగిరిపడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. మారిస్‌పేటలోనూ మరో అగ్నిప్రమాదం జరిగింది. మూడిళ్లు దగ్ధమయ్యాయి.
చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో ఈదురుగాలుల వల్ల ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడి సమీపంలోని వరిగడ్డి కుప్పలకు మంటలు అంటుకున్నారు. 15 ఎకరాలకు సంబంధించిన వరిగడ్డి దగ్ధమైందని బాధితులు తెలిపారు. సుమారు రూ.1.5 లక్షల నష్టపోయాయని వాపోయారు.
ఇదీ చదవండి: