Fire accident in sweet shop: గుంటూరు జిల్లా మంగళగిరి పాత బస్టాండ్ సమీపంలోని ఓ మిఠాయి దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం కారణంగా జరిగిన ప్రమాదంలో మూడంతస్తుల భవనంలోపలి భాగం పూర్తిగా మంటలకు ఆహుతైంది. భవనంలోని మొదటి రెండు అంతస్తులో మిఠాయిలు తయారు చేస్తుండగా... మూడో అంతస్తులో దుకాణ యజమాని కుటుంబసభ్యులు నివాసముంటున్నారు. అయితే మంటలు మూడు అంతస్తులకు వ్యాపించడంతో కుటుంబసభ్యులు భవనంపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు.
తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది