ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వారసుడు కావాలని.... మామే మృగమయ్యాడు..! - గుంటూరు నేర వార్తలు

ఆమెది... ప్రేమ వివాహం పెద్దల అంగీకారంతోనే జరిగింది.. సంసార జీవితం ఆనందంగా సాగింది.. ఇద్దరు అమ్మాయిలకు అమ్మయింది..!! అయితే మగ పిల్లవాడు పుట్టలేదని... మామే లైంగిక వేధింపులకు దిగాడు.. వాటిని భరించలేక..అతన్ని ఎదిరించలేక భర్తకు చెప్పుకుంటే సర్దుకుపొమ్మన్నాడు... అత్తకు విన్నవిస్తే మామూలే కదా అంది.. నిస్సహాయ స్థితిలో పోలీస్​ స్టేషన్‌ గడపతొక్కింది..!!అసలేం జరిగిందో బాధితురాలి ఆవేదన ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

father-in-law-sexually-abused-daughter-in-law-in-guntur
కోడలితో మామ అసభ్య ప్రవర్తన

By

Published : Sep 29, 2020, 9:49 AM IST

మాది గుంటూరు నగరం. నేను ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న క్రమంలో అక్కడే పనిచేస్తున్న యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2016లో వివాహం చేసుకున్నాం. మాకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి మగపిల్లాడిని కనలేదంటూ భర్త వేధించడం ప్రారంభించాడు. అతని ప్రవర్తనపై మామయ్యకు చెపితే.. అతను అసభ్యకరంగా మాట్లాడాడు. మాకు వారసుడు కావాలి. నువ్వు నాతో ఉండు. నేను చూసుకుంటానన్నాడు. నీ కుమార్తె లాంటి దాన్ని అలా మాట్లాడటం పద్ధతి కాదంటే ఇవన్నీ మామూలే అన్నాడు. అప్పటి నుంచి లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. భర్త, మామలు పెట్టే బాధలు భరించలేక పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లాను. -బాధితురాలు

సర్దుకు పొమ్మన్న భర్త, అత్త

మామయ్య నా పిల్లలను చూడాలని సాకుగా చెప్పి మా ఇంటికి వచ్చి అమ్మా, నాన్న ఇంట్లో లేని సమయంలో లైంగిక దాడి చేయబోగా బయటకు వచ్చేశాను. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పుకోలేక భర్తకు చెప్పుకున్నా. ఆయన నాన్నతో సర్దుకుపొమ్మని చెప్పాడు. పెద్దది కదా అర్థం చేసుకుంటుందని అత్తమ్మకు విన్నవిస్తే ఈ రోజుల్లో ఇవి మామూలే కదా అని ఆయన్నే వెనుకేసుకొచ్చింది. దీంతో వారిని ఎదిరించే శక్తి లేక.. ఆ ఇంటికి వెళ్లి ఉండే సాహసం చేయలేక.. మామ, భర్తపై చర్యలు తీసుకొని నాకు రక్షణ కల్పించాలని సోమవారం జరిగిన పోలీసు స్పందన కార్యక్రమంలో ఏఎస్పీ గంగాధరంను కలసి విన్నవించుకున్నా. ఆయన స్పందించి వెంటనే విచారించి చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. -బాధితురాలు

ఇదీ చదవండి:గర్భం దాల్చిన మైనర్.. రాత్రికి రాత్రి బాలుడుతో వివాహం!

ABOUT THE AUTHOR

...view details