పట్టాదారు పాసు పుస్తకాల కోసం గుంటూరు జిల్లా చినకాకాని రైతులు మంగళగిరి తహశీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళకు దిగారు. పాస్ పుస్తకాలు, అడంగళ్‌లో నమోదు చేసేవరకూ ఆందోళన విరమించేది లేదంటూ రాత్రివేళలోనూ కార్యాలయం వద్దే బైఠాయించారు. రెండ్రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని... ఆందోళన విరమించాలని అధికారులు కోరినా రైతులు శాంతించలేదు. ఈ నేపథ్యంలో అధికారులు రాత్రి సమయంలోనూ రికార్డులు పరిశీలించారు. డిజిటల్ సంతకం పని చేయకపోవడంతోనే ఈ సమస్యలు తలెత్తాయని మంగళగిరి తహసీల్దార్ తెలిపారు.
తహసీల్దారు కార్యాలయం ఎదుట రాత్రిపూట రైతుల ఆందోళన - latest news on guntur farmer protests
పట్టాదారు పాసు పుస్తకాల కోసం గుంటూరు జిల్లా చినకాకాని రైతులు మంగళగిరి తహసీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. అడంగళ్‌లో నమోదు చేసేవరకూ ఆందోళన విరమించేది లేదంటూ రాత్రి సమయంలోనూ నిరసన చేశారు. డిజిటల్ సంతకం పని చేయకపోవడంతోనే ఈ సమస్యలు తలెత్తాయని మంగళగిరి తహసీల్దార్ తెలిపారు
పట్టదారు పాసు పుస్తకం కోసం చినకాకాని రైతుల ఆందోళన