సూక్ష్మ, బిందు సేద్య రైతులకు పరికరాలు, యంత్రాలపై ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడేళ్లుగా రాయితీని నిలిపివేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
Farmers protest: 'సూక్ష్మ, బిందు సేద్య పరికరాలపై రాయితీని పునరుద్ధరించాలి'
సూక్ష్మ, బిందు సేద్య రైతులకు పరికరాలపై ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టింది.
రైతుల ధర్నా..
రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా కంపెనీలకు చెల్లించాల్సిన రూ.1300 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో 37 కంపెనీలు సూక్ష్మ నీటి సేద్యపు పరికరాల సరఫరాను పూర్తిగా నిలుపుదల చేశాయని రైతులు, రైతు సంఘాల నేతలు ఆరోపించారు. రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ.. ఏ సంస్థ సూక్ష్మ సేద్య పరికరాలు రాయితీపై అందించేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: