గుంటూరు నందివెలుగు రోడ్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. తమ పంట పొలాలను ఆవులు పాడు చేస్తున్నాయని.. పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నిరసన చేపట్టారు. కొందరు వ్యక్తులు ఏడాది క్రితం ఎక్కడ నుంచో ఆవులను తీసుకువచ్చి.. తమ ప్రాంతంలో వదిలేసి వెళ్లారని.. అవి తమ పంట పొలాలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఆవులు మా పొలాలను నాశనం చేస్తున్నాయ్..'
గుంటూరు నందివెలుగు రోడ్డు వద్ద రైతులు నిరసన చేపట్టారు. తమ పంట పొలాలను ఆవులు నాశనం చేస్తున్నాయని వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు.
farmers agitation at guntur
పగలు ఆవులు పాలాల్లోకి రాకుండా చూసుకుంటున్నామని.. కానీ రాత్రి పూట మాత్రం తమ వల్ల కావడం లేదని రైతులు విచారం వ్యక్తం చేశారు. చేతి దాకా వచ్చిన వరి, మినప, మొక్కజొన్న, పెసర పంటలు అన్ని ఆవుల కారణంగా పాడైపోయాయన్నారు. తమ సమస్యపై పలుమార్లు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా అధికారాలు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: విధి నిర్వహణలో ఓ తల్లికి హోంగార్డు సహాయం
Last Updated : Jan 30, 2021, 8:05 AM IST