విజయనగరం జిల్లా గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో.. 69 నకిలీ చలానాలతో 21 లక్షల అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. జిల్లా రిజిస్ట్రార్ సహా మరికొందరు అధికారులు.. కార్యాలయంలోని వివిధ దస్త్రాలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సహాయ లేఖరి గణేష్‌పై.. సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరమ్మ గజపతినగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంగళగిరిలో 8 లక్షలు..
గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ నకిలీ చలానాల బాగోతం బట్టబయలైంది. నలుగురు లేఖరుల చేతివాటంతో.. 8 దస్త్రాలకు రిజిస్ట్రేషన్ చేయించే సమయంలో 8 లక్షలు పక్కదారి పట్టించినట్లు తేలింది. సీఎంఎఫ్ఎస్ చేపట్టిన రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో ఈ అవినీతి వెలుగుచూసింది. ఆ సొమ్మును ఇప్పటికే రికవర్ చేశామన్న రిజిస్ట్రార్ రాధాకృష్ణమూర్తి.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో..