ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పర్యావరణ హితం... వ్యాపార ప్రయాణం - ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ఇప్పుడు అన్నింటికీ డోర్‌ డెలివరీ వచ్చేసింది. ఒక్కరమే ఎక్కడికన్నా వెళ్లాలంటే వోగో, ర్యాపిడో బైకులు పరిష్కారం అందిస్తున్నాయి. కానీ... దేశవ్యాప్తంగా తిరుగుతున్న లక్షలాది డెలివరీ వాహనాల వల్ల పర్యావరణ కాలుష్యం పెరిపోవడం తథ్యం. ఫలితంగా ఈ సమస్య పరిష్కారాన్ని తన వ్యాపారంగా మలచుకుంది రాశీ అగర్వాల్‌.

పర్యావరణ హితం... వ్యాపార ప్రయాణం
పర్యావరణ హితం... వ్యాపార ప్రయాణం

By

Published : Jun 5, 2021, 9:17 PM IST

ఐఐపీఎంలో గ్రాడ్యుయేషన్‌ చేసిన రాశి ఆ తర్వాత ప్రముఖ సంస్థల్లో పనిచేసింది. సొంతంగా ఏదైనా చేయాలనుకొని భర్త ఆకాశ్‌ గుప్తాతో చర్చించింది. అది పర్యావరణానికి మేలు కలిగించేదై ఉండాలనుకున్నారు. అలా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ మేలని నిర్ణయించుకున్నారు.

అనుకోని మలుపు

‘వోగో, యోలో, ర్యాపిడో’ వంటి స్టార్టప్స్‌ అద్దె వాహనాలను అందిస్తున్నాయి. ఈ వినియోగదారుల్లో 50 శాతం మంది కేవలం అయిదు కిలోమీటర్ల దూరం లోపే ప్రయాణిస్తున్నారు. అలాగే నిత్యావసర వస్తువులు, ఆహారం వంటి వాటి హోం డెలివరీల్లో 30శాతం పెరుగుదల కనిపించింది. వీటివల్ల రోడ్డెక్కుతున్న వాహనాల సంఖ్య ఎక్కువ అవడం గుర్తించారు. ఫలితంగా వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. వీటన్నింటికీ పరిష్కారంగా 2017లో గుడ్‌గావ్‌ కేంద్రంగా ‘జిప్‌ ఎలక్ట్రిక్‌’ సంస్థను భర్తతో కలిసి ప్రారంభించింది. వీళ్లు తయారు చేసిన ఎలక్ట్రిక్‌ జిప్‌ ద్విచక్ర వాహనాలు నచ్చిన ప్రముఖ డెలివరీ సంస్థలు రాశితో చేతులు కలిపాయి.

‘‘ప్రత్యేక సాంకేతికతతో రూపొందించిన మా జిప్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు దుకాణాలు, హోటళ్ల నుంచి ప్రజలకు సరకుల రవాణాకు వారధిలా మారాయి. ఈ క్రమంలో కొన్ని ప్రముఖ సంస్థలు ఓ ప్రతిపాదన పెట్టాయి. అదేంటంటే.. వాహనాలతోపాటు డ్రైవర్లనూ అందించడం. అనుకోని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాం. పైలట్స్‌ ట్రైనింగ్‌ కూడా ప్రారంభించాం. వాహనంతోపాటు డ్రైవర్‌ను కూడా పంపిస్తాం. అప్పుడు ఆ సంస్థలు తమ సర్వీస్‌పైనే దృష్టి ఉంచొచ్చు. ప్రస్తుతం అమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌, గ్రోఫర్స్‌, స్పెన్సర్స్‌, ర్యాపిడో, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, మోడ్రన్‌ బజార్‌, ఈజీడే వంటి ప్రముఖ సంస్థలు మా వాహనాలను వినియోగిస్తున్నాయి. మరో 300కు పైగా చిన్న సంస్థలూ మా సేవలను తీసుకుంటున్నాయి. 15 నగరాల్లో వెయ్యి మందికిపైగా జిప్‌ పైలట్స్‌ నెలకు రెండు లక్షలకు పైగా ట్రిప్పులను వేస్తున్నారు. 2018లో ‘నీతి అయోగ్‌’ పోటీలో బెస్ట్‌ స్టార్టప్‌గా నిలిచాం. దాంతో టొయోటా మొబిలిటీతో భాగస్వామ్యం దక్కింది. ఏంజిల్‌ ఫండింగ్‌ లభించింది. మా ఈ-స్కూటర్‌ జిప్‌ను ప్రధాని మోదీ ప్రశంసించడం మరవలేని జ్ఞాపకం. మా వాహనాలు నగదు, సమయాన్ని ఆదాచేయడమే కాదు, పర్యావరణ రక్షణకూ సహకరిస్తున్నాయి. కోటిన్నరతో ప్రారంభించిన మా స్టార్టప్‌కు గతేడాది ఆదాయం రూ.7.50 కోట్లు వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details