పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్...చివరిగా గుంటూరు జిల్లాలో పర్యటించారు. అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని.. ఎన్నికలు జరగడానికి ఇదే సరైన సమయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకున్నట్లు వివరించారు. తాజాగా హైకోర్టు ఎన్నికలు ఆపడానికి వీల్లేదని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు వ్యతిరేకించే శక్తులు ఇప్పటికైనా అర్ధం చేసుకోని..సహకరించాలని కోరారు. గ్రామస్థులు ఐకమత్యంగా చేసుకునే సాధారణ ఏకగ్రీవాలు గతంలోనూ ఉన్నాయన్న నిమ్మగడ్డ.. అసాధారణ ఏకగ్రీవాలను మాత్రం సమర్ధించబోమన్నారు.
అవి కోర్టులో నిలబడవు...
వ్యవస్థ పట్ల విశ్వాసం, జవాబుదారీతనం కోసమే పంచాయతీ ఎన్నికల్లో ఈ-వాచ్ యాప్ ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ చెప్పారు. దీనిపైనా కోర్టుకు వెళ్లారని..అవి కోర్టులో నిలబడవని ధీమా వ్యక్తం చేశారు.