ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోలుకోని ఏలూరు బాధితులు... తగ్గని మూర్ఛ లక్షణాలు - eluru disease news

గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న ఏలూరు బాధితులు ఇంకా కోలుకోలేదు. చికిత్సలు అందుతున్నన్నప్పటికీ అదే పనిగా మూర్ఛ లక్షణాలతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు వెల్లడించారు. వ్యాధి నిర్ధారణ కోసం అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

Eluru victims
Eluru victims

By

Published : Dec 7, 2020, 3:33 PM IST

కోలుకోని ఏలూరు బాధితులు... తగ్గని మూర్ఛ లక్షణాలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తీవ్ర అస్వస్థతకు గురైన ఐదుగురికి గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్య చికిత్సలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. బాధితులకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేస్తూ... ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు వైద్య సిబ్బంది. చికిత్సలు అందుతున్నన్నప్పటికీ అదే పనిగా మూర్ఛ లక్షణాలతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా... మరో ఇద్దరు అపస్మారక స్థితిలోనే ఉన్నారు. మిగిలిన ఒకరికి రెండు గంటలకొకసారి మూర్ఛ వస్తోందని వైద్యులు వెల్లడించారు.

జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వీరికి అందుతున్న వైద్య సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. వ్యాధి ఏమిటనేది ఇంకా నిర్ధారణ కానప్పటికీ... అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. దీనికోసం నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని జీజీహెచ్​లో ఏర్పాటు చేసినట్లు డాక్టర్ ప్రభావతి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details