ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నరసరావుపేట జేఎన్టీయూ నిర్మాణానికి సహకరిస్తాం'

గుంటూరు జిల్లా నరసరావుపేట జేఎన్టీయూ నిర్మాణానికి సహకరిస్తామని విద్యాశాఖ మంత్రి అన్నారు. కళాశాలల్లో విద్యార్థుల బకాయిలు విడతల వారీగా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

నరసారావు పేట జేఎన్టీయూ నిర్మాణానికి సహకరిస్తాం:విద్యాశాఖ మంత్రి

By

Published : Sep 1, 2019, 10:01 PM IST

నరసారావు పేట జేఎన్టీయూ నిర్మాణానికి సహకరిస్తాం:విద్యాశాఖ మంత్రి
రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నరసరావుపేట జేఎన్టీయూ నిర్మాణానికి సహకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలో కళాశాలకు 80 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం ఉంటుందన్నారు. త్వరలో విద్యార్థుల బకాయిల మొత్తం విడతల వారీగా విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

అమ్మఒడి పథకం జనవరి 23నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సురేష్ తెలిపారు. పథకం గురించి సీఎం జగన్ ప్రకటించిన వెంటనే...అనూహ్య స్పందన లభించిందని...3నెలల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలకు పైగా కొత్తగా విద్యార్థులు చేరారని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం కృషి చేస్తోందని... సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details