ఉపాధ్యాయుల బదిలీల నిర్వహణకు ముందే రేషనలైజేషన్ (సర్దుబాటు) ప్రక్రియను ఓ కొలిక్కి తేవాలనే యోచనలో పాఠశాల విద్యాశాఖ ఉంది. దీనికి సంబంధించిన చర్యలను వేగవంతం చేసింది. జిల్లా విద్యాశాఖ నుంచి టీచర్ల పోస్టులు, పని సర్దుబాటు వివరాలతో కూడిన సమాచారం పంపాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ నుంచి డివిజన్ ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు పాఠశాలల వారీగా శాంక్షన్డ్ పోస్టులు.. ప్రస్తుతం పని చేస్తున్న వారి వివరాలు, పిల్లల ఎన్‌రోల్‌మెంట్ వివరాలను తక్షణమే అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఈ పరిణామం ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. ఇప్పటి వరకు స్వల్ప సంఖ్యలో ప్రవేశాలు ఉన్న పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లను సర్దుబాటులో భాగంగా ఏమూలకు వేస్తారోనన్న ఉత్కంఠ వారిలో నెలకొంది.
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3279 ఉన్నాయి. ప్రతి పాఠశాల నుంచి సంబంధిత నమూనాలో వివరాలను పంపాలని స్పష్టం చేసింది. మూడేళ్ల క్రితం పని సర్దుబాటు కోసం రేషనలైజేషన్ నిర్వహణకు గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ ఆచరణకు వచ్చేసరికి అది అమలు చేయలేదు. దీని వల్ల చాలా పాఠశాలల్లో పిల్లల సంఖ్య కన్నా ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్నారని, మరికొన్నిచోట్ల పిల్లలకు సరిపడా టీచర్లు లేక ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటిని అధిగమించడానికి తక్షణం రేషనలైజేషన్ చేపట్టడమే ఏకైక పరిష్కార మార్గమని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దీంతో జిల్లాలో ఈ దిశగా కసరత్తు జరుగుతోంది.
డైస్‌తో సంబంధం లేకుండా...