గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద 16వ నంబరు గేటు కొట్టుకుపోయిన కారణంగా... ఒక్కసారిగా జలాశయం నుంచి నీరు కింద కు వెళ్లిపోయింది. భారీగా నీరు సముద్రం పాలు కాగా.. మత్స్యసంపద సైతం నేలపాలైంది.
ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 8 టీఎంసీలకు తగ్గిపోగా.. చేపపిల్లలు కిందకు కొట్టుకొచ్చాయి. దిగువన ఉన్న తండా ప్రజలు చేప పిల్లలను పట్టుకునేందుకు పోటీపడ్డారు. శ్వాసించేందుకు తగిననీరు లేక ఎక్కువ చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ గేటును స్టాప్ లాకులతో మూయించేందుకు అధికారులు రెండ్రోజులపాటు శ్రమించారు. మరమ్మతుల కోసం జలాశయంలో ఉన్న నీటిని బయటకు విడిచిపెట్టేశారు.