గుంటూరు నగరంలో తాగునీరు సరఫరా చేయూ ప్రధాన పైప్లైన్ల లీకులకు మరమ్మతుల నిర్వహిస్తున్నందున ఈ నెల 11వ తేదీ వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని గుంటూరు నగర పాలక సంస్థ ఎస్ఈ రవికృష్ణ రాజు తెలిపారు. నగరంలోని హరిహర్మహల్ రిజర్వాయర్ పరిధిలోని 7 ప్రాంతాల్లో, నెహ్రూ నగర్ రిజర్వాయర్ పరిధిలోని 18 ప్రాంతాల్లో తాగునీటి సరఫరా చేయు పైప్ లైన్ల లీకులకు మరమ్మతులు జరగనున్నట్లు తెలిపారు. అంతేకాక హరిహర్ మహల్ రిజర్వాయర్‌లోని 750 కేయల్ సంపు, బీఆర్ స్టేడియంలోని రిజర్వాయర్ల క్లీనింగ్, తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్‌లోని వాల్వ్ మరమ్మతులు నిర్వహిస్తున్నామన్నారు. 10 తేదీన మధ్యాహ్నం వరకు లీకు మరమ్మతు పనులు పూర్తి చేసి సాయంత్రానికి పాక్షికంగా మంచి నీటి సరఫరా జరుగుతుందని.. 11వ తేదీన ఉదయం నుంచి యథావిధిగా మంచినీటి సరఫరా చేస్తామన్నారు.
గుంటూరు నగరంలో తాగునీటి సరఫరాకు బ్రేక్.. - బి.ఆర్ స్టేడియం
గుంటూరు నగరంలో మంచినీటిని సరఫరా ప్రధాన పైప్ లైన్ల లీకులకు మరమ్మతుల కారణంగా ఈ నెల 11న మంచినీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు నగర పాలక సంస్థ ఎస్ఈ రవికృష్ణ రాజు తెలిపారు. నగరంలోని హరిహర్మహల్ రిజర్వాయర్ పరిధిలోని 7 ప్రాంతాల్లో, నెహ్రూ నగర్ రిజర్వాయర్ పరిధిలోని 18 ప్రాంతాల్లో మంచినీటి సరఫరా పైప్ లైన్ల లీకులకు మరమ్మతులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
నగర పాలక సంస్థ ఎస్.ఈ రవికృష్ణ రాజు