ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెనాలిలో డబుల్ హార్స్ మినపగుళ్ల ప్లాంట్... హాజరైన అన్నపూర్ణమ్మ, నవ్యస్వామి - double horse minapa gullu third pland

గుంటూరు జిల్లా తెనాలిలో డబుల్ హార్స్ మినపగుళ్ల మూడో ప్లాంటును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, సీరియల్‌ నటి నవ్య, సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె. నాయుడు పాల్గొన్నారు.

తెనాలిలో డబుల్ హార్స్ మినపగుళ్ల ప్లాంట్
తెనాలిలో డబుల్ హార్స్ మినపగుళ్ల ప్లాంట్

By

Published : Oct 17, 2021, 7:53 PM IST

తెనాలిలో డబుల్ హార్స్ మినపగుళ్ల ప్లాంట్

డబుల్ హార్స్ మినపగుళ్ల సంస్థ మూడో ప్లాంటు ప్రారంభోత్సవం గుంటూరు జిల్లా తెనాలి శివారు నందివెలుగులో ఘనంగా జరిగింది. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, సీరియల్‌ నటి నవ్య, సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె. నాయుడు సహా పలువురు ప్రముఖులు ప్రారంభోత్సవానికి అతిథులుగా హాజరయ్యారు. తెనాలి ఖ్యాతిని డబుల్‌హార్స్‌ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రశంసించారు. వ్యాపారుల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున తోడ్పడతామని చెప్పారు. నాణ్యతతో వినియోగదారుల మన్ననలు పొందుతున్నామని డబుల్ హార్స్‌ సంస్థ యజమాని మోహన్‌శ్యామ్ ప్రసాద్‌ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details