గుంటూరు జిల్లా నగరపాలెంలో దిశ మహిళా పోలీసు స్టేషన్‌ను డీజీపీ గౌతం సవాంగ్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన...మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. 2020ను మహిళా భద్రత సంవత్సరంగా పాటిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 18 దిశ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దిశ స్టేషన్లలో వీలైనంత వరకు మహిళలనే నియమిస్తున్నామని అన్నారు. రాష్ట్రం చేసిన దిశ చట్టానికి కేంద్ర ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. గుంటూరు అర్బన్ జిల్లాను కమిషనరేట్‌గా మార్చే ప్రతిపాదన ఉందన్న డీజీపీ...స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.
మహిళా భద్రతకు పెద్దపీట: డీజీపీ సవాంగ్
దిశ చట్టానికి కేంద్రం ఆమోదం కోసం ఎదురు చూస్తున్నామని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో 18 దిశ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తునామని అన్నారు. 2020ను మహిళా భద్రత సంవత్సరంగా పాటిస్తున్నామని వెల్లడించారు.
disha police station launced by dgp sawang at guntoor