తన తండ్రికి మానసిక విముక్తి కల్పించి ఆరోగ్యవంతంగా బయటకు పంపించేందుకు... ప్రభుత్వానికి ఇంకెన్ని రోజులు సమయం కావాలని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి నిలదీశారు. ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎంపీ గోపాలకృష్ణన్ల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తమకు తెలపాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలపాలని డిమాండ్ చేశారు. గోపాలకృష్ణన్ అనారోగ్యానికి గురయ్యారనే వార్త ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ కేసులతో నిండిన జైలులో బంధించడానికి వారేమీ నేరస్థులు కాదని వైదీప్తి అన్నారు. విచారణకు సంబంధించి ఇప్పటికే చాలా రోజులు గడిచాయని ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి ఇంకెన్ని రోజులు కావాలి: ధూళిపాళ్ల వైదీప్తి - ధూళిపాళ్ల వైదీప్తి న్యూస్
తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలపాలని... ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి డిమాండ్ చేశారు. కొవిడ్ కేసులతో నిండిన జైలులో బంధించటానికి తన తండ్రి, సంగం డెయిరీ ఎండీ నేరస్థులు కాదని ట్వీట్ చేశారు.
ధూళిపాళ్ల వైదీప్తి