గుంటూరు జిల్లాలో మరికొన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇవన్నీ కాంటాక్ట్ కేసులే తప్ప... కొత్తవి కావని ఆయన చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారితో సమస్య తక్కువగానే ఉందన్న ఆయన... దిల్లీ నుంచి వచ్చిన వారు, కలిసిన వారికి విస్తృతంగా పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై 47 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
గుంటూరు జిల్లాలో రెడ్ జోన్లు పెరిగే అవకాశం: డీజీపీ - గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్
కరోనాకు సంబంధించి కాంటాక్ట్ కేసులు తప్ప కొత్త కేసులు లేవని ఇది మంచి పరిణామం అని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారని అన్నారు. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 8 రెడ్‌జోన్లు ఉన్నాయని.. వాటిని పెంచే అవకాశం ఉందని తెలిపారు. రెడ్ జోన్లలో ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
![గుంటూరు జిల్లాలో రెడ్ జోన్లు పెరిగే అవకాశం: డీజీపీ dgp-on-guntur-corona-cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6715192-thumbnail-3x2-dgp.jpg)
dgp-on-guntur-corona-cases