గుంటూరు జిల్లా తీర ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలతో కొంత మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్లపాలెం మండలం చింతాయ పాలెం పంచాయతీ పరిధిలోని పంట భూములులో ఇటీవల కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల వల్ల పొలాల్లో గుంతలు పడిపోయాయి. దీని వలన పక్కనే ఉన్న పంట పొలాలకు మెరక అవ్వడం వలన నీరు నిలబడక తవ్వకాలు జరిపిన పొలాల్లోకి నీరు నిల్వ ఉంటోంది.
ఇసుక అక్రమ తవ్వకాలతో పంట పొలాలు నాశనం - గుంటూరు
ఇసుక అక్రమ తవ్వకాలపై కర్లపాలెం మండలం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మండలంలోని చింతాయపాలెంలో ఇసుక తవ్వకాల వల్ల పొలాల్లో గుంతలు ఏర్పడ్డాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పొలాల్లో నీరు చేరింది. ఫలితంగా సాగు చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు రైతులు తెలిపారు. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక అక్రమ తవ్వకాలు
పంట సాగుకు విత్తనాలు వేసుకున్న రైతులకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తవ్వకాలు జరుగుతున్న సమయంలో అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.