లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని శాసనసభ ఉప సభాపతి కోన రఘపతి సూచించారు. కొద్ది రోజులు ఓపిక పడితే కరోనాను తరిమి కొట్టవచ్చని బాపట్లలో ప్రచారం చేశారు. సామాజిక దూరం పాటించటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, అత్యవసరమైతేనే బయటకు రావడం వంటి చర్యలు పాటించాలన్నారు. ఇది మన కోసం మన భవిష్యత్తు కోసం అని చెప్పారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
కరోనాపై.. ప్రజలకు ఉప సభాపతి అవగాహన
శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించారు. తన సొంత వాహనంలో మైక్ సెట్ ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. బాపట్ల నియోజకవర్గంలో పర్యటించారు.
కరోనాపై అవగాహన కల్పించిన కోనరఘపతి